![]() |
![]() |
.webp)
రీసెంట్ గా హారర్ థ్రిల్లర్ మూవీ "పిండం" లో నటించిన నటుడు శ్రీరామ్ రీసెంట్ గా ఒక షోలో పార్టిసిపేట్ చేసాడు. కాజల్ అగర్వాల్ కు అసలు పెళ్ళెందుకైపోయిందో అంటూ ఫీలయ్యాడు. ఐతే ఈ షోలో కొన్ని పిక్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమని హోస్ట్ అష్షు రెడ్డి చెప్పేసరికి అందులో కాజల్ పిక్ కనిపించింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు "దడ" మూవీలో కాజల్, శ్రీరామ్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేశారు. ఐతే ఈ మూవీలో కాజల్ తో డేటింగ్ సీన్స్ లాంటివి ఉంటే బాగుండేది అంటూ చెప్పాడు. కాజల్ తో అండర్ వాటర్ రొమాన్స్ చేయాలనీ ఉంది అంటూ ఆ రెండు పిక్స్ కి మ్యాచింగ్ చేసాడు. ఎందుకు ఇలా మ్యాచింగ్ చేసాడో దానికి ఉన్న రీజన్ ఏంటో కూడా చెప్పాడు. కాజల్ కి స్విమ్మింగ్ వచ్చు కానీ తనకు రాదనీ చెప్పాడు. అమ్మాయిలకు తెలుసు అని చెప్పే అబ్బాయిల కంటే తెలీదు అని చెప్పే అబ్బాయిలంటేనే ఎక్కువ ఇష్టం.
చెప్పాలంటే కాజల్ చాలా బాగుంటుంది. చాలా ఇంటెలిజెంట్ కూడా..ఐనా నాకు పెళ్లయిపోయింది ఆవిడకు పెళ్లయిపోయింది ఇంకేముంది అంటూ కామెడీ చేసాడు శ్రీరామ్. అలాగే తాను నటించిన 'రెక్కీ' వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఓటీటీ కోసం 'నెట్ వర్క్, హరికథ' అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు చెప్పాడు. తమిళ్ లో 'బ్లాక్ మెయిల్' అనే మూవీ అలాగే 'సంభవం' అనే చిత్రంలో కూడా నటిస్తున్నానని చెప్పాడు. అలాగే తమిళ్ లో "కాఫీ విత్ కాదల్" అనే మూవీలో జీవ, జైతో కలిసి నటించాడు. రెక్కీ 2 త్వరలో రాబోతోంది. అందులో ఫామిలీ డ్రామా కూడా ఉండబోతోంది అని చెప్పాడు. యూత్ కి సోషల్ మీడియా గురించి ఒక మెసేజ్ ఇచ్చాడు. వెస్ట్రన్ పీపుల్ అంతా మనల్ని మన తెలివితేటల్ని తక్కువ చేసి సోషల్ మీడియాకి అలవాటు చేయాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ కాదు..డైరెక్ట్ ఇంటరాక్షన్ తో ఫ్రెండ్స్ ని పెంచుకోండి. మీకోసం ఎవరు నిలబడతారో వాళ్లనే ఎంచుకోండి. మీరు పోస్ట్ చేసే రీల్స్ కి లైక్స్ వేసిన వాళ్లంతా ఫ్రెండ్స్ కారు అని చెప్పాడు.
![]() |
![]() |